Saturday, September 15, 2007

బానిస

నేను చాలా రోజులు గా అలొచిస్తున్నాను.. అసలు జనం మద్యం ఎందుకు తాగుతారు అని... ఇది ఏదొ వ్యస రచన లా అనిపిస్తుందా.. ఏమో నేను నా అలొచనలని ఇక్కద మీతో పంచుకుంటున్నాను.
ఒకరు నేను రోజంతా చాలా కష్తపడుతున్నాను, అందుకని రాత్రి మందు తాగుతున్నాను అంటాడు
ఇంకొకరు నేను చాలా భాధలో ఉన్నాను అందుకు అంటాడు
ఇంకొకరు నేను చాలా సంతోషం గా ఉన్నాను అందుకని... తాగేవాడు ఒక్కడే తాగడు.. చుట్టుపక్కల అందరిని పిలిచి తాగిస్తాడు..
ఒకరు టైం గడవడం కోసం..

కొందరికి అది స్టేటస్..
ఒకడు నేను సన్న గా ఉన్నాను.. కొంచెం బాడి పెంచడానికి తాగుతున్నాను అంటాదు..

ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తాగడం అవసరమా.. అది ఏమైనా ఎనెర్జి డ్రింక్ అనుకుంటారా..
జనం ఈ తాగుడు కి పెట్టే ఖర్చులు లేకుంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది.. ఈ తాగుడు కోసం వాళ్ళు పెట్టే ఖర్చులు పేద వాళ్ళకు ఉపయోగ పడేలా ఖర్చు చేస్తే మన దేశం లొ పేదరికం చాలా వరకు తగ్గి ఉండేది..